మచ్ అవైటెడ్ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు.దసరాకు ఈసాంగ్ రిలీజ్ అవుతుందని ఎదురుచూశారు కానీ నిరాశే ఎదురైయింది.ఇక దసరాకి మిస్ అయినా దీపావళికి ఎలాగైనా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే అంత కన్నా కాస్త ముందుగానే రానుంది.ఈ విషయాన్ని సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ వెల్లడించాడు.కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన నాగవంశీ సాంగ్ ఎప్పడు వస్తుందో చెప్పేశాడు.గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రెడీ అయిపోయిందని కానీ సాంగ్ మీద అంచనాలు అందుకోవాలని ప్రతి సారి కరెక్ట్ చేసుకుంటున్నాం.ఈనెల మొదటి వారంలో సాంగ్ పక్కా రిలీజ్ ఉంటుందని అన్నాడు.దాంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇక ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది.ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో వున్నారు.అందులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలోగా షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్ లో వుంది.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: