
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 232


బేబీ చేతిలో మూడు సినిమాలు

కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ

విజయకాంత్ సమాధి వద్ద సూర్య కన్నీరు

రామ్ చరణ్ RC16లో కన్నడ సూపర్ స్టార్

యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న భీమా టీజర్

అందుకే వెనక్కి వెళ్ళాం -రవితేజ

మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?

సంక్రాంతి సినిమాల రన్ టైం రివీల్

నైజాంలో సలార్ విధ్వంసం.. బాహుబలి రికార్డ్ బ్రేక్

యాత్ర 2 టీజర్ రిలీజ్.. జగన్ పాత్రలో జీవా అదుర్స్

సలార్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం

400కోట్ల క్లబ్ లో డంకి

అయలాన్ ట్రైలర్ రిలీజ్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు.

బేబీ చేతిలో మూడు సినిమాలు
బేబీతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య.అంతకు ముందు వెబ్ సిరీస్ ల్లో అలాగే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేసింది.ఇక గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.ఏకంగా 70కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ లాభాలను తీసుకొచ్చింది.ఈసినిమాలో వైష్ణవి నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.

కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను న్యూజిలాండ్ లో మొదలుపెట్టిన చిత్రయూనిట్ అక్కడ 90 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని రీసెంట్ గానే వచ్చారు.

విజయకాంత్ సమాధి వద్ద సూర్య కన్నీరు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ తమిళ నటుడు మరియు రాజకీయ నేత అయిన కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. కెప్టెన్ అనూహ్య మరణం తమిళ చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇక తమ ప్రియతమ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. అయితే ఆ సమయంలో విదేశాల్లో షూటింగ్ కారణంగా నటుడు సూర్య కెప్టెన్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.

రామ్ చరణ్ RC16లో కన్నడ సూపర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తరువాత, ఆయన 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయనున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ (శివన్న) కూడా చేరడం గమనార్హం.

గుంటూరు కారం సెన్సార్ రివ్యూ
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న భీమా టీజర్
ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, ఫోటోలు వైరల్
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం తర్వాత జాన్వీ కపూర్, మహేశ్వరిలు రంగనాయకుల మండపంలో పండితుల నుంచి వేదఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అందుకే వెనక్కి వెళ్ళాం -రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈగల్ సంక్రాంతి వార్ నుండి తప్పుకుంది.నిన్న రిలీజ్ విషయంలో చాలా సేపు సస్పెన్స్ కొనసాగకా ఈరోజు ఉదయం సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతికి రావాలని చివరి నిమిషం వరకు పోరాడారు కానీ రాత్రి నిర్మాత ల మండలి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు అంగికరించి వేరే సినిమాల గురించి ఆలోచించి ఈనిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?
2023 ఇయర్ ముగిసిపోయింది. ఎన్నో సినిమాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు ఇలా ఎన్నో సినిమాలు అలరించాయి. వాటిలో కొన్ని సినిమాలు సంచనాలు సృష్టిస్తే.. కొన్ని పరాజయం పాలయ్యాయి. ఇక గత ఏడాది కొన్ని క్రేజీ కొత్త జంటలు సైతం స్క్రీన్ పై మెరిశాయి. చిరంజీవి-శృతిహాసన్, బాలకృష్ణ-కాజల్, నవీన్ పోలిశెట్టి-అనుష్క తోపాటు చాలా పెయిర్స్ సందడి చేశాయి. మరి కింద తెలిపిన జంటల్లో మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

సంక్రాంతి సినిమాల రన్ టైం రివీల్
ఈ సంక్రాంతికి ఎప్పుడు లేనంతగా తీవ్రమైన పోటీ నెలకొంది.ఒకటి కాదు రెండు ఏకంగా 5సినిమాలు వస్తున్నాయి.ఇందులో ఒకటి డబ్బింగ్ సినిమా అదే అయలాన్.శివ కార్తికేయన్ నటించిన ఈసినిమా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తుంది.ఈరోజు రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక మిగితావి స్ట్రయిట్ తెలుగు సినిమాలు.అందులో ముగ్గురి స్టార్ హీరోల సినిమాలు ఉండగా మరొకటి మీడియం బడ్జెట్ మూవీ. అవేంటంటే గుంటూరు కారం,హనుమాన్,సైంధవ్,నా సామి రంగ.

నైజాంలో సలార్ విధ్వంసం.. బాహుబలి రికార్డ్ బ్రేక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ విడుదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

నా సామిరంగ నుండి విజిల్ థీమ్ సాంగ్ రిలీజ్
నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన అప్ డేట్లను వరుసగా ఇస్తున్నారు.

యాత్ర 2 టీజర్ రిలీజ్.. జగన్ పాత్రలో జీవా అదుర్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

పొంగల్ రేస్ నుంచి తప్పుకున్న ‘ఈగల్’.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్' సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గురువారం అఫీషియల్‌గా వెల్లడించారు. అంతకుముందు తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సినిమాల నిర్మాతలతో తాము జరిపిన చర్చలు ఫలించాయని ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు ‘ఈగల్’ సినిమాను వాయిదా వేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారని, అందుకు హీరో రవితేజకు మరియు పీపుల్స్ మీడియా వారికి…

సలార్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్
సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమాలోని ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డైలాగ్స్ మాత్రం సినిమాలో మరింత హైలెట్ గా నిలిచాయి. ఈనేపథ్యంలోనే సలార్ లోని కొన్ని ఇంపాక్ట్ ఫుల్…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన మెగాస్టార్ దంపతులు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డిపాటుగా పలువురు మంత్రులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా మెగాస్టార్ తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ మేరకు గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ను బట్టి. ఇక ఈసినిమా ట్రైలర్ ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అదేరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుండగా ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

400కోట్ల క్లబ్ లో డంకి
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకి బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు ఈసినిమా 417.10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షారుక్ కు ఇది మూడో 400కోట్ల సినిమా.ఇక దేశ వ్యాప్తంగా డంకి 200కోట్ల నెట్ ను రాబట్టుకుంది.ఇప్పట్లో హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఫుల్ రన్ లో డంకి 500కోట్ల మార్క్ ను చేరుకోనుంది.

హనుమాన్.. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె…