రామ్ చరణ్ RC16లో కన్నడ సూపర్ స్టార్

Shiva Rajkumar Likely to Join For Mega Power Star Ram Charan's RC16 Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తరువాత, ఆయన ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయనున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ (శివన్న) కూడా చేరడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శివ రాజ్‌కుమార్ ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివన్న #RC16లో నటించడంపై క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్ర నిర్మాతలు తనను సంప్రదించినట్లు ధృవీకరించిన ఆయన చరణ్ సినిమాలో నటించనున్నట్లు వెల్లడించారు. ఇక గతంలో ఒకసారి ఎక్స్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో ‘ఆర్ఆర్ఆర్’ మరియు ‘మగధీర’ రెండింటిలో రామ్ చరణ్ నటన తనకు నచ్చిందని శివ రాజ్‌కుమార్ వెల్లడించారు. దీంతో.. చరణ్ మూవీలో శివన్న నటించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే.. పొలిటిక‌ల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ డైలాగ్ రైటర్ సాయిమాధ‌వ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =