మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గురువారం అఫీషియల్‌గా వెల్లడించారు. అంతకుముందు తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సినిమాల నిర్మాతలతో తాము జరిపిన చర్చలు ఫలించాయని ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు ‘ఈగల్’ సినిమాను వాయిదా వేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారని, అందుకు హీరో రవితేజకు మరియు పీపుల్స్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గతేడాది సంక్రాంతి సందర్భంగా మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడంతో నిర్మాతలు ఇబ్బంది పడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు విడుదల చేస్తే గత ఏడాది పరిస్థితే ఏర్పడుతుందన్న ఆలోచనతో నిర్మాతలు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ఈగల్’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 9న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే అదేరోజున విడుదల కానున్న ‘టిల్లు స్వేర్’ను మరో తేదీకి వాయిదా వేసుకునేందుకు నిర్మాత నాగవంశీ అంగీకరించారు. అలాగే అదేరోజు రిలీజ్ అవనున్న మరో చిత్రం ‘యాత్ర-2’ను కూడా వాయిదా వేసుకోవాలని మేకర్స్‌కు ఛాంబర్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.
బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥
మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎
Now, EAGLE 🦅 takes flight for a global release in Telugu & Hindi on FEB 9th, 2024! 💥🔥… pic.twitter.com/VD20y8aAL2
— People Media Factory (@peoplemediafcy) January 5, 2024
కాగా ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన ‘గుంటూరు కారం’, విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కలిసి చేసిన ‘సైంధవ్’, నాగార్జున అక్కినేని, విజయ్ బిన్నీ కాంబోలో వస్తోన్న ‘నా సామిరంగ’తో పాటు తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలన్నింటికి థియేటర్లు దొరకడం కష్టసాధ్యం కావడం, అలాగే మరోవైపు ఇది ఆయా సినిమాల కలెక్షన్స్‌పై ప్రభావం పడి నిర్మాతలు నష్టపోయే ఆస్కారం ఉండటంతో తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంక్రాంతి సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: