ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ‘యాత్ర 2’ టీజర్ రిలీజ్ అయింది. దీనిపై నటుడు మమ్ముట్టి ఇటీవలే సోషల్ మీడియా వేదికగా జనవరి 5 ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లుగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ‘యాత్ర 2’ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో తనకెదురైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు జగన్ సిద్దమవడం, ఈ సందర్భంగా ఆయన చెప్పే డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. ఇక జగన్ పాత్రలో అయితే జీవా జీవించేశాడనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ సీఎం జగన్‌ను దింపేశాడు. అలాగే మమ్ముట్టి మరోసారి వైఎస్సార్‌గా కనిపించి అలరించారు.
కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: