బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకి బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు ఈసినిమా 417.10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షారుక్ కు ఇది మూడో 400కోట్ల సినిమా.ఇక దేశ వ్యాప్తంగా డంకి 200కోట్ల నెట్ ను రాబట్టుకుంది.ఇప్పట్లో హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఫుల్ రన్ లో డంకి 500కోట్ల మార్క్ ను చేరుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విక్కీ కౌశల్, బోమన్ హిరానీ ,తాప్సి పన్ను కీలక పాత్రల్లో నటించగా ప్రీతమ్ సంగీతం అందించాడు.జీ స్టూడియోస్ తో కలిసి షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఇక గత ఏడాది షారుక్ బాగా కలిసొచ్చింది.వరస పరాజయాల తరువాత పఠాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వగా నాలుగు నెలల క్రితం జవాన్ తో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఈరెండు సినిమాలు 1000కోట్లకు పైగా రాబట్టాయి.ఇక ఇప్పుడు డంకి తో మరో విజయాన్ని అందుకున్నాడు.ఇలా ఓకే ఏడాది మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: