యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న భీమా టీజర్

gopichand bhimaa movie teaser out now

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈమధ్య కాలంలో ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ను చూస్తుంటే సినిమా చాలా పవర్ ఫుల్ గా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. రాక్షసులను వేటాడే బ్రాహ్మాణుడు వచ్చాడు అంటూ గోపీచంద్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈసినిమానురిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eighteen =