మాస్ మహారాజా రవితేజ ఈగల్ సంక్రాంతి వార్ నుండి తప్పుకుంది.నిన్న రిలీజ్ విషయంలో చాలా సేపు సస్పెన్స్ కొనసాగకా ఈరోజు ఉదయం సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతికి రావాలని చివరి నిమిషం వరకు పోరాడారు కానీ రాత్రి నిర్మాత ల మండలి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు అంగికరించి వేరే సినిమాల గురించి ఆలోచించి ఈనిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ గురించి రవితేజ ట్వీట్ చేశాడు.తెలుగు సినిమాల బాగు గురించి సంక్రాంతి నుండి తప్పుకుంటున్నామని కానీ ఎప్పడూ వచ్చిన ఈ సారి గురి తప్పదని సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు.తము నష్టపోతున్నామని తెలిసి కూడా వేరే సినిమాల గురించి ఆలోచించి రిలీజ్ ను వాయిదా వేయడంతో సోషల్ మీడియా లో ఈగల్ మేకర్స్ ను అలాగే రవితేజ ను అభినందిస్తున్నారు.
Taking a step back for the welfare of our Telugu Cinema🤗
A little change in the arrival not in the shot & target 💥#EAGLE from February 9th,2024 :))))
Wishing the very best to all the films releasing this Sankranthi 😊 pic.twitter.com/LU2e7nSmy0
— Ravi Teja (@RaviTeja_offl) January 5, 2024
ఇక ఈగల్ వచ్చే నెల 9న విడుదలకానుంది.సంక్రాంతిని త్యాగం చేసినందుకు సోలో రిలీజ్ ఇస్తామని నిర్మాతల మండలి మీటింగ్ లో హామీ ఇచ్చారు.దాంతో ఫిబ్రవరి 9న రావాల్సిన టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదాపడాల్సి వస్తుంది అయితే ఈవాయిదా గురించి నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటివరకు అయితే అధికారకంగా స్పందించలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























