పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ విడుదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా నైజాంలో ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలిరోజునుంచే ఇక్కడ సత్తా చూపిన సలార్ చిత్రం.. రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నైజాంలో ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉండగా.. తాజాగా సలార్ దీనిని అధిగమించింది. అయితే ప్రభాస్ తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన డంకీతో పోటీపడిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
𝗧𝗛𝗘 𝗗𝗜𝗡𝗢𝗦𝗔𝗨𝗥 𝗦𝗖𝗢𝗥𝗘𝗦 𝗔 𝗚𝗜𝗚𝗔𝗡𝗧𝗜𝗖 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 ❤️🔥❤️🔥#BlockbusterSalaar crosses the 𝟏𝟎𝟎 𝑪𝑹𝑶𝑹𝑬 𝑮𝑹𝑶𝑺𝑺 in Nizam 🔥🔥
– https://t.co/N5FRW6NoU6Nizam Release by @MythriOfficial 💥#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel… pic.twitter.com/xlPeEg1mZn
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2024
కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై ‘కె.జి.యఫ్’, ‘కాంతారా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన విజయ్ కిరగందూర్ గ్రాండ్‌గా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: