ఈ సంక్రాంతికి ఎప్పుడు లేనంతగా తీవ్రమైన పోటీ నెలకొంది.ఒకటి కాదు రెండు ఏకంగా 5సినిమాలు వస్తున్నాయి.ఇందులో ఒకటి డబ్బింగ్ సినిమా అదే అయలాన్.శివ కార్తికేయన్ నటించిన ఈసినిమా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తుంది.ఈరోజు రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక మిగితావి స్ట్రయిట్ తెలుగు సినిమాలు.అందులో ముగ్గురి స్టార్ హీరోల సినిమాలు ఉండగా మరొకటి మీడియం బడ్జెట్ మూవీ. అవేంటంటే గుంటూరు కారం,హనుమాన్,సైంధవ్,నా సామి రంగ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో మూడు సినిమాలు గుంటూరు కారం,హనుమాన్, సైంధవ్ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ గా వున్నయి.ఇక అయలాన్ సెన్సార్ కు అప్లై చేసుకుంది నా సామి రంగ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.సాంగ్ షూటింగ్ ఒక్కటి బ్యాలెన్స్ వుంది.వచ్చే వారంలో సెన్సార్ కంప్లీట్ కానుంది.
సెన్సార్ కంప్లీట్ అయిన మూడు సినిమాల రన్ టైం రివీల్ అయ్యాయి.ముందుగా గుంటూరు కారం సెన్సార్ యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకోగా 159నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈసినిమాను తివిక్రమ్ డైరెక్ట్ చేశాడు.
ఇక హనుమాన్ కూడా మంచి హైప్ వస్తుంది.ఈసినిమా యు/ఏ సర్టిఫెకెట్ దక్కించుకోగా 148నిమిషాల నిడివితో రానుంది.ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.సైంధవ్ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.ఈసినిమా కు యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకోగా 140నిమిషాల రన్ టైంతో రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























