కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ తమిళ నటుడు మరియు రాజకీయ నేత అయిన కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. కెప్టెన్ అనూహ్య మరణం తమిళ చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇక తమ ప్రియతమ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. అయితే ఆ సమయంలో విదేశాల్లో షూటింగ్ కారణంగా నటుడు సూర్య కెప్టెన్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజయకాంత్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ముగించుకుని విదేశాలనుంచి గురువారం సూర్య చెన్నై చేరుకున్నారు. అనంతరం విజయకాంత్ సమాధిని దర్శించిన సూర్య తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా విజయకాంత్‌ని తలచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా సూర్య కెరీర్ తొలినాళ్లలో ‘పెరియన్న’ అనే చిత్రంలో విజయకాంత్ అతిధి పాత్రలో కనిపించారు. అలాగే ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలుండేవి. ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయకాంత్‌తో కలిసి పనిచేస్తూ, మాట్లాడుతూ, భోజనం చేస్తూ గడిపిన రోజులను తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంటూ సూర్య కెప్టెన్ కు నివాళి అర్పించారు. కాగా ఈ పర్యటనలో సూర్యతోపాటుగా ఆయన సోదరుడు, హీరో కార్తీ కూడా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: