తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డిపాటుగా పలువురు మంత్రులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా మెగాస్టార్ తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ మేరకు గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పోర్టికోలోకి ఎదురొచ్చి వారికి సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం కూడా చిరంజీవి దంపతులను శాలువాలతో సత్కరించారు. ఆ తరువాత అందరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Mega star @KChiruTweets, along with his wife #SurekhaKonidela garu, met Honble’ Deputy CM of Telangana, @Bhatti_Mallu, at Praja Bhavan yesterday and extended their warm wishes! 💐💐#Chiranjeevi #Mega156 #TeluguFilmNagar pic.twitter.com/e3jZvGyW05
— Telugu FilmNagar (@telugufilmnagar) January 5, 2024
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఆయన తాజాగా ఒక కొత్త సినిమా (#మెగా156)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) కాన్సెప్ట్‌తో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమవ్వగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: