కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ

manchu vishnu son avram debut in kannappa movie

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను న్యూజిలాండ్ లో మొదలుపెట్టిన చిత్రయూనిట్ అక్కడ 90 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని రీసెంట్ గానే వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాలో మరో వారసుడు కూడా ఎంటీ ఇవ్వనున్నాడు. ఆ వారసుడు ఎవరో కాదు మంచు విష్ణు తనయుడు అవ్రామ్. ఈవిషయాన్ని విష్ణు మంచు అధికారికంగా తెలియచేశాడు. కన్నప్ప సినిమాతో మంచు విష్ణు ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం అంటూ తెలిపాడు. మొత్తానికి మోహన్ బాబు వారసత్వంతో మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చాడు.. మంచు విష్ణు వారసత్వంతో అవ్రామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చూద్దాం మరి అవ్రామ్ పాత్ర ఎలా ఉండబోతుందో..

 కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =