నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన అప్ డేట్లను వరుసగా ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎత్తుకెళ్లాలనిపిస్తుందే, టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరోపాటతో వచ్చేశారు. ఈసారి విజిల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శాండిల్య పీసపాటి ఈ పాటను ఆలపించగా ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
Kishtayya & Anji – A special bond forged by god 🤩🫂
Here’s #WhistleThemeSong to endear your hearts ❤️
🎤 @SandilyaPisapa1#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun… pic.twitter.com/xnjmdXSHuu
— Allari Naresh (@allarinaresh) January 5, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉండగా ఈసినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: