
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 197


ఎన్ బి కె 109లో దసరా విలన్

రాజా సాబ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్

ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్

మురుగదాస్ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్

భారీ యాక్షన్ మోడ్ లో NBK 109

దేవర షూటింగ్ అప్డేట్

సందీప్ కిషన్ 30వ సినిమా అనౌన్స్మెంట్

సలార్- వరదరాజ మన్నార్ పై స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్

అశ్విన్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

బ్రేక్ ఈవెన్ దిశగా గామి

విశ్వంభర సాంగ్ షూట్ కంప్లీట్
మెగాస్టార్ చిరంజీవి- బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అవ్వగా పెద్దగా బ్రేక్ లేకుండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.అందులో భాగంగా తాజాగా ఈసినిమాలో ఒక సాంగ్ ను చిత్రీకరించారు.ఈసాంగ్ కు నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశాడు.ఈ సందర్భంగా నా కల నెరవేరింది బ్యూటీఫుల్ సాంగ్ కోసం మెగాస్టర్ కు కొరియోగ్రఫీ చేశా అని తన ఆనందాన్ని ఇంస్టా గ్రామ్ ద్వారా పంచుకున్నాడు విజయ్ బిన్నీ.

ఎన్ బి కె 109లో దసరా విలన్
వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి సూపర్ ఫామ్ లో వున్నాడు దర్శకుడు బాబీ.ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.అదే ఎన్ బి కె 109(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గా చిన్న గ్లింప్స్ ను కూడా వదిలారు.ఈసినిమా బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని ఆగ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.ఇక మేకర్స్ ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటికే విలన్ పాత్రకు బాబీ డియోల్ ను తీసుకోగా దుల్కర్ సల్మాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్.

మహేష్ బాబు ప్రేమలు రివ్యూ పై కార్తికేయ సూపర్ రిప్లై
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'ప్రేమలు' మూవీ తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీని చూసి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. ఒక సినిమా చూస్తూ, చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదని, అంతగా ఈ చిత్రం తనను ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు.

'ఓం భీమ్ బుష్'.. టైటిల్‌కి అర్ధం ఏంటంటే? డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రాజా సాబ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్
రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఫ్యామిలీ స్టార్- కలర్ ఫుల్ కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ముందుగా రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమానే. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తుండగా.. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల కానుంది.

గామి రేటింగ్ తగ్గడం పై విశ్వక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా గామి. ఈసినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈసినిమా 22 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే సక్సెస్ ఫుల్ గా థియేటరల్లో రన్ అవుతుంది.

ప్రేమలు తెలుగు లోకూడా సత్తా చాటుతుంది
చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది.గత నెలలో మళయాలం లో విడుదలైన ఈసినిమా విడుదలై 30రోజులు దాటినా ఇప్పటికీ సూపర్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో ఈ ఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.

మురుగదాస్ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ వరుసగా సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ అందించారు.

భారీ యాక్షన్ మోడ్ లో NBK 109
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

దేవర షూటింగ్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ ఈనెల 19నుండి గోవాలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు.గాయం నుంచి కోలుకున్న సైఫ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర షూటింగ్ లోనే సైఫ్ గాయపడిన విషయం తెలిసిందే దాంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది అందులో భాగంగా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలకానుంది.

సందీప్ కిషన్ 30వ సినిమా అనౌన్స్మెంట్
'ఊరు పేరు భైరవకోన' సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్.. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన తదుపరి ప్రాజెక్టు గురించి కీలక ప్రకటన చేశారు. దీనిలో భాగంగా మంగళవారం తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. 'ధమాకా' వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని #SK30 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించనున్నారు.

కొనసాగుతున్న గామి జైత్రయాత్ర, 4 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. క్రౌడ్ ఫండ్ చేసిన ఈ ఈ మూవీలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్టే రిలీజైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

సలార్- వరదరాజ మన్నార్ పై స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్
సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఫ్యామిలీ స్టార్ నుండి కల్యాణి వచ్చా వచ్చా సాంగ్ ప్రోమో రిలీజ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

గామిలో సింహం సీక్వెన్స్ అలా తీశాం - నిర్మాత కార్తీక్ శబరీష్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కాగా ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేయడం విశేషం. వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, విమర్శకుల ప్రశంసలని అందులోని ఘన విజయాన్ని సాధించింది. ‘గామి’ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత కార్తీక్ శబరీష్ విలేకరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై ప్రశాంత్ వర్మ అప్ డేట్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

అశ్విన్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్
నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. గత ఏడాది హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.

బ్రేక్ ఈవెన్ దిశగా గామి
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బ్రేక్ఈవెన్ దిశగా సాగుతుంది.మూడు రోజుల్లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది నిర్మాతలు ప్రకటించారు. ఇందులో షేర్ 9కోట్లు.కేవలం 11కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో మరో రెండు కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లే.ఈవారంలో ఆమార్క్ ను చేరుకోనుంది.