సలార్- వరదరాజ మన్నార్ పై స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్

prabhas salaar part 2 shooting update

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పై ఇప్పటికే పలు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాబి సింహా ఏప్రిల్ లో ఈసినిమా షూటింగ్ మొదలవ్వనుందని తెలిపాడు. ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి క్రేజీ వార్త ఒకటి వినిపిస్తుంది. ముందుగా పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. ఈ ఎపిసోడ్ లో పృథ్వీరాజ్ పవర్ ను చూపించనున్నారట. ఆ తరువాత బాబి సింహా, శ్రియా రెడ్డి, జగపతిబాబు ల పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట. మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ పార్ట్ ను షూట్ చేస్తారని తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =