యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బ్రేక్ఈవెన్ దిశగా సాగుతుంది.మూడు రోజుల్లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది నిర్మాతలు ప్రకటించారు. ఇందులో షేర్ 9కోట్లు.కేవలం 11కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో మరో రెండు కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లే.ఈవారంలో ఆమార్క్ ను చేరుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో గామి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హాఫ్ మిలియన్ మార్క్ దిశగా సాగుతుంది.విశ్వక్ కెరీర్ లో ఇవే బెస్ట్ కలెక్షన్స్.విద్యాధర్ కాగిత డైరక్ట్ చేసిన ఈసినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా నరేష్ కుమారన్ సంగీతం అందించాడు.
ఇక విశ్వక్ ప్రస్తుతానికి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి.కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఏప్రిల్ లేదా మేలో విడుదలచేయన్నారు.ఈసినిమాకాకుండా రవితేజ డైరెక్షన్ లో తన 10వ ఈసినిమాలో నటిస్తున్నాడు విశ్వక్.ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: