నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. గత ఏడాది హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు శివం భజే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసందర్బంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.
Get ready to witness the power you know, the play you don’t 🔥
Proudly presenting the Title of @GangaEnts #ProductionNo1 – #ShivamBhaje 🔱@imashwinbabu @arbaazSkhan @DiganganaS @apsardirector @MaheswaraMooli @vikasbadisa @Dsivendra @ChotaKPrasad @sahisuresh #AnithMadadi pic.twitter.com/oKeqsEh1hp
— Ganga Entertainments (@GangaEnts) March 11, 2024
కాగా గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా ‘హైపర్’ ఆది కీీలక పాత్రలో నటించనున్నాడు. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: