ఫ్యామిలీ స్టార్ నుండి కల్యాణి వచ్చా వచ్చా సాంగ్ ప్రోమో రిలీజ్

Kalyani Vaccha Vacchaa song from out from Family Star movie

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే నందనందన అనే పాటను రిలీజ్ చేయగాా ఆపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా కల్యాణి వచ్చా వచ్చా అంటూ వచ్చే ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కలర్ ఫుల్ గా ఉన్న ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. మంగ్లీ, కార్తీక్ పాడిన ఈపాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =