
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 171


సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణమ్మ

ప్రతినిధి 2 రిలీజ్ ట్రైలర్ చూశారా?

థగ్ లైఫ్ నుండి శింబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్

విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే

ప్రతినిధి 2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

అనుపమ చేతిలో నాలుగు సినిమాలు

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం

స్వయంభూ కోసం 8కోట్లతో ఎపిక్ వార్ ఎపిసోడ్

డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్

ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

థగ్ లైఫ్- రానున్న మాసివ్ అప్ డేట్

రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ షురూ

అక్కడ అదరగొడుతున్న బాక్

కొడుకుతో బ్రహ్మీ కొత్త సినిమా 'బ్రహ్మానందం'
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడైతే కొన్ని సెలక్టివ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఆ మధ్య రంగమార్తండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అయితే ఈసారి సొంత తనయుడితో రావడం విశేషం. బ్రహ్మనందం, కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. బ్రహ్మనందం అనే టైటిల్ తోనే ఈసినిమా రాబోతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణమ్మ
విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ సినిమా వస్తుంది.

ప్రతినిధి 2 రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం విరామం తర్వాత ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో ఆయన నటించి సూపర్ హిట్ అయిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‍గా ఇది రూపొందింది. తెలుగువారికి సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కాగా మూర్తికి డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టుగా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. పాలిటిక్స్ నేపథ్యం కలిగిన కథాంశం కావడం, రాజకీయాలపై మూర్తికి బాగా పట్టు ఉండటం మరియు తొలిసారి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.

థగ్ లైఫ్ నుండి శింబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
లోకనాయకుడు కమల్ హాసల్ మాత్రం వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో థగ్ లైఫ్ సినిమా కూడా ఒకటి ఉంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మణిరత్నం, కమల్ నుంచి వస్తున్నా రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఈసినిమా అయితే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ వస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్- ఓటీటీలో టాప్ ప్లేస్ లో
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.

విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే
రీసెంట్ గా ది ఫ్యామిలీ స్టార్ తో పలకరించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.నిన్న ఈసినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ విషయం లో క్లారిటీ రావాల్సివుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇక ఈనెల 9న విజయ్ తన బర్త్ డేను జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది.

ప్రతినిధి 2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
టాలీవుడ్ హీరోలలో నారా రోహిత్‌ది ప్రత్యేక శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటారు. గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమాలేవీ రాలేదు. అయితే ఇటీవలే ‘ప్రతినిధి 2’ మూవీతో మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నారా రోహిత్. తెలుగువారికి సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కాగా మూర్తికి డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టుగా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది.

అనుపమ చేతిలో నాలుగు సినిమాలు
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చేతినిండా ఆఫర్ల తో ప్రస్తుతం ఫుల్ బిజీ మోడ్ లో వుంది.రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.అందులో మూడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వున్నాయి. అందులో ఒకటి పరదా.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనుపమతోపాటు దర్శన రాజేంద్రన్,సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం
హరీష్ శంకర్,మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం యూఎస్ వెళ్లనున్నారు.ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.

పవర్ స్టార్ కు సపోర్ట్ గా మెగాస్టార్, సినీ సెలబ్రిటీలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్స్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే కదా. పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నా కూడా షూటింగ్ లను మధ్యలోనే ఆపేసి తన ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టారు. ఇక ఎన్నికలకు ఎన్నో రోజులు లేకపోవడంతో ఎండలను సైతం లెక్కచేయకుండా వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుకోసం కూడా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తాను పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్లి విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ప్రచారంలో పాల్గొనగా.. హైపర్ ఆది, సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను తో పాటు ఇంకా చాలామంది…

స్వయంభూ కోసం 8కోట్లతో ఎపిక్ వార్ ఎపిసోడ్
యంగ్ హీరో నిఖిల్ మాత్రం విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ2 సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

భజే వాయు వేగం- సెట్ అయ్యిందే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా భజే వాయి వేగం. ఫాదర్ సెంటిమెంట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

పుష్ప విలన్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్
మాలీవుడ్ విలక్షణ నటుడు పహద్ ఫాజిల్ 'పుష్ప' మరియు అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఆవేశం'. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా కథాంశంతో 'రోమాంచం' ఫేమ్ జీతూ మాధవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫహాద్ ఫాజిల్ కెరీర్‌లో వంద కోట్ల వసూళ్లను రాబట్టిన ఫస్ట్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది. అలాగే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా 'మంజుమ్మల్ బాయ్స్', 'ప్రేమలు', 'ది గోట్ లైఫ్' సినిమాల తర్వాత 'ఆవేశం' నిలిచింది.

డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్
అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఈసినిమాను ప్రకటించకముందు నభానటేష్, ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. అయితే సినిమాను ప్రకటించిన తరువాత ప్రమోషన్ భాగంగా ఇలా చేశారని క్లారిటీ వచ్చేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్.

ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ లో ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమా అని లేదు చిన్న సినిమా అని లేదు హిట్ అయిన సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందించిన సినిమా ఆర్ఆర్ఆర్.

థగ్ లైఫ్- రానున్న మాసివ్ అప్ డేట్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఒక సినిమా థగ్ లైఫ్. చాలా ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.

రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు అన్నీ ఆకట్టుకున్నాయి.

ప్రేమలు- ఓటీటీ లో కూడా సూపర్ రెస్పాన్స్
గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా వచ్చేస్తుంది.

ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ షురూ
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ ఈసిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ రెండు సిరీస్ లు రాగా రెండు సిరీస్ లూ ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా... రెండో సిరీస్ ను కూడా తెరకెక్కించారు. ఈ సిరీస్ 2021లో రిలీజ్ అయింది. సిరీస్ 2 లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.

అక్కడ అదరగొడుతున్న బాక్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి అరణ్ మనై 4 తమిళనాడు లో అదరగొడుతుంది. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు లో మూడో రోజుల్లో 23కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా సరైన సినిమాలు లేక తమిళనాడు బాక్సాఫీస్ వెలవెలబోయింది.రీసెంట్ గా వచ్చిన అరణ్ మనై 4 బిగ్ రిలీఫ్ ను ఇచ్చిందని చెప్పొచ్చు.