ప్రతినిధి 2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Nara Rohith Starrer Prathinidhi 2 Certified with UA as Completed Censor Formalities

టాలీవుడ్ హీరోలలో నారా రోహిత్‌ది ప్రత్యేక శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుంటారు. గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమాలేవీ రాలేదు. అయితే ఇటీవలే ‘ప్రతినిధి 2’ మూవీతో మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నారా రోహిత్. తెలుగువారికి సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కాగా మూర్తికి డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టుగా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాలిటిక్స్ నేపథ్యంలోని కథాంశం కావడం, రాజకీయాలపై మూర్తికి బాగా పట్టు ఉండటం మరియు తొలిసారి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. ఇక గతంలో నారా రోహిత్ నటించి సూపర్ హిట్ అయిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ కావడం.. అందునా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంతటా ఆసక్తి నెలకొంది. త్వరలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ కానుండటం గమనార్హం.

ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు మరియు ప్రమోషనల్ కంటెంట్ అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటినీ పెంచాయి. మే 10వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ప్రతినిధి 2’ నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే..? ప్రతినిధి 2 సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ అందించింది. ఇక రన్‌టైమ్‌ చూస్తే గం.2:16 (136) నిమిషాలు కలిగి ఉంది. త్వరలోనే బుకింగ్‌లు ప్రారంభమవుతాయని మేకర్స్ తెలిపారు.

కాగా ప్రతినిధి 2లో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనునుండగా.. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.