
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 162


సూర్య -సుధా కొంగర సినిమా లేనట్లే

క్లైమాక్స్ షూట్ లో పుష్ప 2

విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ వచ్చేస్తోంది

అజిత్ తో మెగాస్టార్ పాత జ్ఞపకాలు

భజే వాయు వేగం సెన్సార్ కంప్లీట్

రేపు మహేష్ బాబు చేతులమీదుగా.. హరోంహర ట్రైలర్ రిలీజ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ కంప్లీట్

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్

3డిలో రానున్న కల్కి

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న సాయి దుర్గా తేజ్

నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టిన చిరు

సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

లవ్ మీ 3 డేస్ షాకింగ్ కలెక్షన్స్

ఈవారం రానున్న సినిమాలు ఇవే
ఈవారం బాక్సాఫీస్ వద్ద ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఐపీఎల్ అయిపోవడంతో అందరి ద్రుష్టి సినిమాలపై పడింది.ఐపీఎల్ కు తోడు రెండు నెలల నుండి సరైన సినిమాలు లేక డల్ సీజన్ నడిచింది.అయితే ఈ వారం వచ్చే సినిమాలతో మళ్ళీ థియేటర్లు కలకలడనున్నాయి.ఇక ఈసారి వస్తున్న సినిమాలు కూడా అంతే ఇంట్రెస్ట్ గా వున్నాయి.ఇందులో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయు వేగం అలాగే ఆనంద్ దేవరకొండ గం.గం.. గణేశా వున్నాయి.ఈ మూడు సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానున్నాయి.

సూర్య -సుధా కొంగర సినిమా లేనట్లే
లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో సూర్య తన 43 చేయాల్సివుంది. ఈ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సురరై పోట్రు ఓటిటి లో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది దాంతో ఇదే కాంబో లో మరో సినిమా అనేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే కాస్టింగ్ ను సెలెక్ట్ చేశారు.నజ్రియా నజీమ్ ,దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ లను కీలక పాత్రలకు ఎంపిక చేశారు.అయితే ఈసినిమా ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.

క్లైమాక్స్ షూట్ లో పుష్ప 2
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్ లో క్లైమాక్స్ షూటింగ్ ను జరుపుతున్నారు. లీక్ ల భారిన పడకుండా కట్టుదిట్టమైన భదత్ర నడుమ షూటింగ్ ను చేస్తున్నారట.ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే పుష్ప 3 కి లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ షెడ్యూల్ తరువాత స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు.ఇక ఈరోజు ఈసినిమా నుండి రెండో పాట సూసేకి రిలీజ్ చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.చంద్రబోస్ లిరిక్స్ ,దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ సాంగ్ ను ఇన్స్టాంట్ చార్ట్ బాస్టర్ చేశాయి.

విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ వచ్చేస్తోంది
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. తమిళ నటుడైనప్పటికీ అన్ని భాషల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మహారాజా'. ఈ మూవీకి 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటి మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అజిత్ తో మెగాస్టార్ పాత జ్ఞపకాలు
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.

సినిమా లవర్స్ డే.. మల్టీప్లెక్స్‌ల్లో రూ.99కే టికెట్స్
ప్రేక్షకుల్లో చాలామందికి మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడాలని ఆశగా ఉంటుంది. అయితే అక్కడ ఉండే టిక్కెట్ రేట్లు కారణంగా వెనకాడుతుంటారు. అలాంటి మూవీ లవర్స్‌కు శుభవార్త. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోని టిక్కెట్ రేట్ల కంటే తక్కువ ధరతోనే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం వస్తే.. అది కూడా కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం కలుగనుంది. అయితే ఈ అఫర్ కేవలం ఒక్క రోజుకే పరిమితం. కాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రేక్షకులకు ఆ అద్భుత అవకాశం కల్పిస్తోంది.

భజే వాయు వేగం సెన్సార్ కంప్లీట్
యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమా ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటుందని మేకర్స్ కూడా తెలిపడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఫైనల్ గా మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే చిత్రయూనిట్ పలు అప్ డేట్లతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్…

రేపు మహేష్ బాబు చేతులమీదుగా.. హరోంహర ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్
త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తుంది. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పుడో మొదలైన ఈసినిమా పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ.. షూటింగ్ జరుపుకొంటూ వస్తుంది. ఎట్టకేలకు జులై12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

తండేల్.. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ - నాగచైతన్య
తండేల్.. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అని పేర్కొన్నారు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిగురించి మాట్లాడుతూ.. "ఏదేని క్లిష్టమైన పాత్ర వచ్చినప్పుడు, మీరు ఆ పాత్రకు అనుగుణంగా ఉండాలి. అందుకే నేను తండేల్ కోసం సుమారు తొమ్మిది నెలలు వెచ్చించాను. ఇది స్ఫూర్తిదాయకమైన కథ. అన్నీ సరిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా. ముఖ్యంగా శ్రీకాకుళం యాస సరిగ్గా ఉండేలా సిద్ధమయ్యాను. ఇది నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్, నాకు ఈ పాత్ర అవసరం” అని నాగచైతన్య చెప్పారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ కంప్లీట్
యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది.

పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకి కపుల్ సాంగ్ రిలీజ్
అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి సెకండ్ పార్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దానికి తగ్గట్టే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జూన్ వరకూ ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్
ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప.. పుష్ప' పాటే వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప 2' చిత్రం నుంచి విడుదల చేసిన ఈ ఫస్ట్ సింగిల్ నెట్టింట సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్‌కు యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

భజే వాయు వేగం- చూపు తిప్పుకోలేనంత ఎంగేజింగ్ గా ఉంటుంది
కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమా ఈ నెల 31వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి ఈసినిమా గురించి ఈసినిమాలోని హైలైట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.

3డిలో రానున్న కల్కి
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898ఏడి విడుదలకు రెడీ అవుతుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.రీసెంట్ గా ఈసినిమా నుండి బుజ్జిని పరిచయం చేశారు.ఈ నెల 31న మరో సర్ప్రైజ్ రానుంది.ఇక ఈసినిమా 2డి తోపాటు 3డి లోకూడా విడుదలకానుందని సమాచారం.అందుకు సంబంధించిన వర్క్ జరుగుతుందంట.

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న సాయి దుర్గా తేజ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు.వాళ్ళ అమ్మ పేరును కూడా తన పేరులో యాడ్ చేసుకున్నాడు.ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది విరూపాక్ష తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఈహీరో.ఇక అప్పటినుండి ఇప్పటివరకు మరో సినిమాను మొదలు పెట్టలేదు.అయితే విరూపాక్ష తరువాత తేజ్, సంపత్ నంది డైరెక్షన్ లో గంజా శంకర్ చేద్దాం అనుకున్నాడు.

నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టిన చిరు
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి మిక్సడ్ రిజల్ట్ ఇచ్చింది.సంక్రాంతికి చిరు, వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమా 200కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమా తరువాత చేసిన భోళా శంకర్ నిరాశ పరిచింది.ఇక ప్రస్తుతం చిరు,విశ్వంభర లో నటిస్తున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చిరుకి జోడిగా త్రిష కనిపించనుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి ,ఇషా చావ్లా ,మీనాక్షి చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు.సంక్రాంతికి విడుదలకానుంది.

సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మొదట చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
విలక్షణ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్ లో వస్తున్న సినిమా భారతీయుడు2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.

లవ్ మీ 3 డేస్ షాకింగ్ కలెక్షన్స్
దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆశిష్ రెడ్డి. రీసెంట్ గానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన సినిమా లవ్ మీ. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాపై రిలీజ్ కు ముందే ఎంతో క్యూరియాసిటీని పెంచింది. ఫైనల్ గా మే 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.