కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 161

bhaje vaayu vegam movie telugu review
రివ్యూ

భజే వాయు వేగం మూవీ తెలుగు రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే కార్తికేయ భజేవాయి వేగం సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీకెండ్ కు వచ్చిన ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

TFN Adminవాట్సాప్
Mahesh Babu Emotional Post on His Father Super Star Krishna
సినిమా వార్తలు

తండ్రి కృష్ణను తలచుకుంటూ.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ జయంతి నేడు. దీనిని పుర‌స్క‌రించుకొని ఆయన తనయుడు, స్టార్ హీరో మ‌హేష్‌ బాబు తండ్రిని గుర్తుచేసుకుని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఒక భావోద్వేగభరిత పోస్ట్ పంచుకున్నారు. కాగా తండ్రిని గుర్తుచేసుకుంటూ మ‌హేష్‌ బాబు పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
allari naresh aa okkati adakku movie streaming on ott
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు

ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా సినిమాకు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈమధ్య తన నుండి వచ్చిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వంలో నరేష్ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు నరేష్. మే 3 తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అనుకున్నంత విజయాన్ని అయితే ఈసినిమా అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Naga Vamsi Says If OG Comes we will postpone Lucky Bhaskhar
సినిమా వార్తలు

ఓజీ వస్తే తప్పుకుంటాం - నాగవంశీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓజీ' సెప్టెంబర్ 27న విడుదలకానుందని తెలిసిందే. పవన్ అందుబాటలో లేకపోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది లేకపోతే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. అయితే రిలీజ్ డేట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త టెంక్షన్ మొదలయ్యింది. ఓజీ వచ్చే డేట్ కు లక్కీ భాస్కర్ వస్తుందని మేకర్స్ నిన్న ప్రకటించారు. వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Sharwanand is the first choice for Gangs of Godavari
సినిమా వార్తలు

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ ఛాయస్ హీరో ఎవరంటే

విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా వస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఈసినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.విశ్వక్ కు మాస్ లో క్రేజ్ వుండడం సినిమా కూడా అదే జోనర్ కావడం అలాగే ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
manamey movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

మనమే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
sudheer babu clarity on harom hara movie release postponed
సినిమా వార్తలు

హరోం హర రిలీజ్ వాయిదా పై సుధీర్ క్లారిటీ

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
gam gam ganesha premiere show talk out
సినిమా వార్తలు

గం.గం.. గణేశా స్పెషల్ షో టాక్

గత ఏడాది బేబితో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గం. గం.. గణేశా అంటూ పలకరించడానికి రెడీ అయ్యాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు హైప్ వచ్చింది. ఇక సినిమా మీద వున్న కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ లో వున్న దగ్గరి వాళ్లకు స్పెషల్ షోస్ ను వేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
nithiin thammudu movie shooting update
షూటింగ్ అప్‌డేట్

నితిన్ తమ్ముడు భారీ యాక్షన్ షెడ్యూల్ అప్ డేట్

ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్ వేణు. ఆయన ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో తమ్ముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శ్రీరామ్ వేణు.

TFN Adminవాట్సాప్
Producer Suryadevara Radhakrishna Mother Passed Away
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు మాతృ వియోగం

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ గురువారం కన్నుమూశారు. 90 సంవత్సరాల నాగేంద్రమ్మ హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
actor sathyaraj interesting comments on modi biopic
సినిమా వార్తలు

వాళ్లు చేస్తే మోడీ బయోపిక్ చేస్తా

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా వచ్చింది. ఆతరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కూడా వచ్చింది.

TFN Adminవాట్సాప్
Prasanth Varma and Ranveer Singh's Rakshas Movie Shelved
సినిమా వార్తలు

అఫీషియల్.. ఆగిపోయిన ప్ర‌శాంత్ వ‌ర్మ - రణ్‌వీర్‌సింగ్‌ కాంబో ప్రాజెక్ట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వర్మ‌ 'హ‌నుమాన్‌' సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా 330 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఔరా అనిపించింది. దీంతో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో అయనకు టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.

Srikanth Mవాట్సాప్
devaki nandana vasudeva movie jai bolo krishna song promo out
సాంగ్

దేవకీ నందన వాసుదేవ సెకండ్ సింగిల్ జై భోలో సాంగ్ ప్రోమో రిలీజ్

హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Prabhas' Sci-Fi Epic Movie is One of India's Most Expensive Movies of All Time
సినిమా వార్తలు

కల్కి 2898 AD.. గ్లోబల్ రేంజ్‍ మూవీ - ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీని భారతదేశంలోనే ఇప్పటివరకూ వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పేర్కొంటున్నారు.

Srikanth Mవాట్సాప్
satyadev krishnamma movie streaming in over 240 countries
ఓటీటీ

కృష్ణమ్మ మూవీ 240 దేశాల్లో స్ట్రీమింగ్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ పేరు కూడా ముందుంటుంది. ఏ పాత్ర అయినా సరే తనదైన శైలిలో నటించగలితే సత్తా ఉన్న నటుడు. సత్యదేవ్ కు కూడా మంచి హిట్ దక్కి చాలా కాలమై పోయింది. అయినా కూడా సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
sudheer babu harom hara movie trailer out now
ట్రైలర్ & టీజర్

హరోం హర ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కు కూడా మంచి హిట్ దక్కి చాలా రోజులైంది. ఈమధ్య పలు సినిమాలతో వచ్చినా కూడా ఏది సాలిడ్ హిట్ ను అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్తూరు నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. జూన్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Aa Pilla Kanule Video song from sirish buddy movie
సాంగ్

బడ్డీ ఫస్ట్ సింగిల్ ఆ పిల్ల కనులే వీడియో సాంగ్ రిలీజ్

గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టింది మాత్రం లేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Lucky Baskhar Telugu Movie Release Date
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సీతారామం సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Movie Release Date
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు రిలీజ్ పై మరో ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Tappa Tappa Lyrical Video Song Released From Manamey
సాంగ్

మనమే నుండి థర్డ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కంధుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'నాన్న' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్