ఇండియన్ 2 సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్

indian 2 movie second single full song out now

త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా భారతీయుడు 2. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తుంది. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పుడో మొదలైన ఈసినిమా పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ.. షూటింగ్ జరుపుకొంటూ వస్తుంది. ఎట్టకేలకు జులై12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్లు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చే ఈపాట ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చెంగలువ చేయందేన చెలికాని చేరేనా.. నిజమేనా నిషాంతమేనా..సంద్రాలు రుచి మార్చేనా.. మధురాలు పంచేనా ఇది వేరే ప్రపంచమేనా.. సమీప దూరాలనే నిర్ణయం.. గతాల గాయం ఇవేల నీ రాకతో జయం అంటూ వచ్చే ఈ మెలోడియనస్ పాట అయితే ఆకట్టుకుంటుంది. తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈపాటను అభే వి ఇంకా శృతిక సముద్రాల ఆలపించారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.