పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకి కపుల్ సాంగ్ రిలీజ్

pushpa 2 movie second single sooseki song out now

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. పుష్ప ఫస్ట్ పార్ట్‌ ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి సెకండ్ పార్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దానికి తగ్గట్టే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జూన్‌ వరకూ ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప అంటూ వచ్చిన ఈపాట సోషల్ మీడియాలో ఫుల్ వ్యూస్ తో దుమ్ము లేపుతుంది. అంతేకాదు ఈపాట తాజాగా యూట్యూబ్ లో ఆరు భాషల్లో కలిపి ఈ పాటకు 10 కోట్లకుపైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ తో వచ్చేశారు. సూసేకి అంటూ వచ్చే కపుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈపాటను రిలీజ్ చేశారు. ఆరు భాషల్లో కూడా ఈపాటను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. ఇక ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. మరి ఈ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.