గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి మిక్సడ్ రిజల్ట్ ఇచ్చింది.సంక్రాంతికి చిరు, వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమా 200కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమా తరువాత చేసిన భోళా శంకర్ నిరాశ పరిచింది.ఇక ప్రస్తుతం చిరు,విశ్వంభర లో నటిస్తున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చిరుకి జోడిగా త్రిష కనిపించనుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి ,ఇషా చావ్లా ,మీనాక్షి చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు.సంక్రాంతికి విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వంభర షూటింగ్ చివరి దశకి రావడంతో చిరు తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశాడు.అందులో భాగంగా డైరెక్టర్ మోహన్ రాజా తో కథా చర్చలు జరుపుతున్నాడు.చిరు,మోహన్ రాజాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లాంఛనమే కానుందట.విశ్వంభర తరువాత పలు ఆఫర్లు వున్నా తన 157వ సినిమాను మోహన్ రాజాతో చేయడానికే చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.దాంతో వీరి కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయినట్లే.
ఇంతకుముందు మోహన్ రాజా- చిరంజీవి కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ వచ్చింది.ఈసినిమా 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది.త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























