
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 163


దేవకీ నందన వాసుదేవ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మనమే థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

మరోసారి గొప్పమనసు చాటుకున్న చిరు

పవన్, ప్రభాస్ లో అదే కామన్ పాయింట్

ఓజీ ట్రైలర్ రెడీ

లవ్ మీ 2 డేస్ కలెక్షన్స్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

రవితేజ 75కి హీరోయిన్ దొరికేసింది

మైత్రీ చేతికి క్రేజీ సినిమాల నైజాం హక్కులు

కన్నప్ప టీజర్ కు కేన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్

కొత్త సినిమా టైటిల్ ప్రకటించిన డైరెక్టర్ గుణశేఖర్
టాలీవుడ్‌లోని క్రియేటివ్ డైరెక్టర్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. ఆయన చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఒక్కో సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకునే ఆయన గతేడాది 'శాకుంతలం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించగా.. మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక దీనికి ముందు 'రుద్రమదేవి' చిత్రాన్ని స్టార్ నటి అనుష్కతో తీసి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది.

పుష్ప2 సెకండ్ సాంగ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈపార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు…

ఎన్టీఆర్ జయంతి.. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మరియు పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం వారంతా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించారు.

బచ్చలమల్లి నుండి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు అల్లరి నరేష్. సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఆ తరువాత ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో వచ్చాడు. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం.. సముచిత గౌరవం - మెగాస్టార్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అగ్ర నటుడు నందమూరి తారక రామారావుకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం సముచిత గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే తెలుగు ప్రజలందరి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నేడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక ఇటీవలే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' అవార్డును అందించిన విషయం తెలిసిందే.

దేవకీ నందన వాసుదేవ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు, సుధీర్ బాబు ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. ఇక వారి తరువాత సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మనమే థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక జూన్ 7వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే వీటిలో 'డెవిల్' మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పటికీ కథనంలో ఎక్కడో తేడా కొట్టడంతో విజువల్ పరంగా బాగుందని టాక్ వచ్చినా సక్సెస్ కొట్టలేకపోయింది.

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
భారతీయ చిత్ర పరిశ్రమలోని నటీనటులకు, ప్రత్యేకించి మన టాలీవుడ్ లోని ప్రముఖులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఎమిరేట్స్ ఫస్ట్ ప్రత్యేక గోల్డెన్ వీసాను మెగాస్టార్‌కి అందించింది. తద్వారా ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడిగా చిరంజీవి నిలిచారు. ఇక స్పెషల్ గోల్డెన్ వీసా పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోసారి గొప్పమనసు చాటుకున్న చిరు
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో చిరు ఎప్పుడూ ముదుంటారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోసారి తన ఉదారతను చూపించారు చిరు.

పవన్, ప్రభాస్ లో అదే కామన్ పాయింట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.

ఓజీ ట్రైలర్ రెడీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయింది.పవన్ ఇన్ని రోజులు ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇక ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగియడంతో జూన్ నుండి ఓజీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఇక ఈసినిమా ట్రైలర్ కట్ కూడా జరిగిపోయందట.ఫస్ట్ వెర్షన్ ట్రైలర్ ను అయితే రెడీ గా పెట్టుకున్నామని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలావుండనుందో అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బచ్చలమల్లి ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకే జోనర్ కు పరిమితమవ్వకుండా పలు జోనర్లు ట్రై చేయడానిక చూస్తున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం అంటూ సీరియస్ పాత్రలు చేయగా సామిరంగ సినిమాలో మరోసారి గమ్యం సినిమాలోని తరహా పాత్రను చేశాడు. రీసెంట్ గా మళ్లీ తన కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో వచ్చాడు.

గోట్ కోసం విజయ్ మరోసారి
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ యాక్టింగ్ తోపాటు సింగింగ్ లోకూడా ఇరగదీస్తాడని తెలిసిందే. విజయ్ తో తన సినిమాల్లో ఒక్క సాంగ్ అయినా పాడిస్తుంటారు సంగీత దర్శకులు.అవన్నీ చార్ట్ బాస్టర్ అయ్యాయి.అయితే ఈసారి ఒక్క సాంగ్ తో ఆపలేదు విజయ్. ఏకంగా రెండు పాటలు పాడాడు.విజయ్ ప్రస్తుతం ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమా చేస్తున్నాడు.నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.జూన్ లోపు కంప్లీట్ కానుంది.

లవ్ మీ 2 డేస్ కలెక్షన్స్
సమ్మర్ లో బాక్సాఫీస్ కాస్త వెలవెలబోయింది అని చెప్పొచ్చు. ఎప్పుడూ సమ్మర్ కు పలు సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం పెద్దగా సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. ఈనేపథ్యంలో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా లవ్ మీ. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన సినిమా లవ్ మీ.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ట్రైలర్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.ఈ ట్రైలర్ ను ఊర మాస్ గా కట్ చేసి అంచనాలను పెంచడం లో టీం సక్సెస్ అయ్యింది.ఇందులో విశ్వక్ డైలాగ్స్, ఆటిట్యూడ్ హైలైట్ అయ్యాయి.ఇప్పటివరకు యూట్యూబ్ లో ట్రైలర్ వ్యూస్ 2 మిలియన్లు దాటింది.

రవితేజ 75కి హీరోయిన్ దొరికేసింది
రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే 75వ సినిమాకు హీరోయిన్ దొరికేసింది.సామజవరగమన రైటర్ భాను బోగవరపు ఈసినిమా ను తెరకెక్కించనున్నాడని తెలిసిందే.ఈసినిమా కోసం హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించనుంది.త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు.ఇక శ్రీలీల,రవితేజ తో జత కొట్టడం ఇది రెండో సారి.

సీక్వెల్‍కి ముందు రీ-రిలీజ్‌కి సిద్దమైన భారతీయుడు
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఇండియన్ 2'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వీరి కాంబినేషన్ లో 1996లో వచ్చిన 'భారతీయుడు' (ఇండియన్)కి సీక్వెల్‍గా ఇది తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ చేతికి క్రేజీ సినిమాల నైజాం హక్కులు
ఈమధ్య నిర్మాణ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

కన్నప్ప టీజర్ కు కేన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్
బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కన్నప్ప. మంచు విష్ణు కేరీర్ లోనే వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. శివుని భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమా వస్తుండటం.. దానికి తోడు ప్రభాస్ తో పాటు ఈసినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.