తండేల్.. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ – నాగచైతన్య

Naga Chaitanya Says, Thandel is The Biggest Film in My Career

తండేల్.. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అని పేర్కొన్నారు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిగురించి మాట్లాడుతూ.. “ఏదేని క్లిష్టమైన పాత్ర వచ్చినప్పుడు, మీరు ఆ పాత్రకు అనుగుణంగా ఉండాలి. అందుకే నేను తండేల్ కోసం సుమారు తొమ్మిది నెలలు వెచ్చించాను. ఇది స్ఫూర్తిదాయకమైన కథ. అన్నీ సరిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా. ముఖ్యంగా శ్రీకాకుళం యాస సరిగ్గా ఉండేలా సిద్ధమయ్యాను. ఇది నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్, నాకు ఈ పాత్ర అవసరం” అని నాగచైతన్య చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఓటీటీ యుగంలో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టమైన పని అని, అందుకు ఒక్కటే మార్గం ఉందని తెలిపారు చైతన్య. ఈ సందర్భంగా సినిమా రంగంలో వస్తున్న మార్పులపై నాగచైతన్య స్పందించారు. “ప్రస్తుత ఓటీటీల కాలంలో భారీ విజువల్స్ ఉండే సినిమాలే.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవు. అయితే కేవలం మార్కెట్ కోసమే భారీ విజువల్స్ పెట్టకూడదు. ప్రాజెక్ట్‌ను బట్టి అది ఆర్గానిక్‍గా ఉండాలి. అలాగే దీనిలో కంటెంట్ ప్రధానం అయి ఉండాలి. ఎందుకంటే అది మార్కెట్‌కు అవసరం” అని తెలిపారు.

కాగా తండేల్ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడిగా కనిపించనున్నారు. తన కెరీర్‌లో చైతన్య ఇలా ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటం ఇదే తొలిసారి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ‌చైత‌న్య ఓ జాల‌రి పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌గా, ప‌ల్లెటూరి అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథగా ఇది తెరకెక్కుతోంది.

దీంతో ఆయన ఈ పాత్రను ఒక సవాల్‌గా తీసుకుని నటిస్తున్నారు. దీనిలో భాగంగా సహజంగా కనిపించేందుకు మత్స్యకారుడి పాత్రకు తగట్టుగా చైతూ మేకోవర్ అవ్వడం విశేషం. ఇక కొద్దిరోజులక్రితం ‘ఎస్సెన్స్ అఫ్ తండేల్’ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. దీంతో తండేల్ సినిమాపై ఇటు అభిమానుల్లో.. అటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి.

క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‍ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.