యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్

Pushpa 2 First Single Crosses 100 Million Views in YouTube

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పుష్ప.. పుష్ప’ పాటే వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ చిత్రం నుంచి విడుదల చేసిన ఈ ఫస్ట్ సింగిల్ నెట్టింట సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్‌కు యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొత్తం ఆరు భాషల్లో కలిపి ఈ పాటకు 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చాయని వారు తెలిపారు. కాగా పుష్ప 2 నుంచి మే 1న ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలిసిందే. పుష్పరాజ్ యాటిట్యూడ్ తెలిపేలా సాగే ఈ పాట హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసేలా ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది.

ఇక ఒకవైపు ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సమయంలోనే బుధవారం ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుండటం విశేషం. ‘సూసేకి’ అంటూ సాగిపోయే కపుల్ సాంగ్ నేడు రిలీజ్ కాబోతోంది. ఈ ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కానున్న ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషాల్ ఆరు భాషల్లో ఆలపించడం గమనార్హం. పుష్ప 1లోని శ్రీవల్లి సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. తాజాగా విడుదలవనున్న ఈ మెలోడీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.