విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ వచ్చేస్తోంది

Vijay Sethupathi’s 50th Film Maharaja Trailer to be Out Tomorrow

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. తమిళ నటుడైనప్పటికీ అన్ని భాషల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహారాజా’. ఈ మూవీకి ‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌, మలయాళ నటి మమతా మోహన్‌ దాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ‘మహారాజా’ విజయ్ సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మహారాజా మూవీకి సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. మహారాజా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు దీనిని విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో మక్కల్ సెల్వన్ గళ్ల చొక్కా ధరించి, రక్తంతో తడిసిన రేజర్‌ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఇంకా ముఖంపై గాట్లతో, చేతిలో కత్తి పట్టుకొని కౄరంగా కనిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇంతకుముందు లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ కూడా నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌లో చేతిలో కత్తి పట్టుకొని హెయిర్‌ సెలూన్‌ ఛైర్‌పై కూర్చున్న విజయ్ సేతుపతి చెవికి పట్టీతో రక్తపు మరకలతో కనిపిస్తుండగా పక్కనే పోలీసులు కూడా ఉండటం గమనించొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.