యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమా ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటుందని మేకర్స్ కూడా తెలిపడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఫైనల్ గా మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే చిత్రయూనిట్ పలు అప్ డేట్లతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The adrenaline packed emotional ride is all set to begin with a U/A certificate 🔥
Watch #BhajeVaayuVegam in theaters WW on May 31st 🚘💥#BVVonMay31st @Ishmenon @Dir_Prashant @RAAHULTYSON @UV_Creations @radhanmusic @RDRajasekar #KapilKumar @SatyaG_Editor @UVConcepts_… pic.twitter.com/E4cZjMvtGb
— Kartikeya (@ActorKartikeya) May 29, 2024
కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































