ప్రేక్షకుల్లో చాలామందికి మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడాలని ఆశగా ఉంటుంది. అయితే అక్కడ ఉండే టిక్కెట్ రేట్లు కారణంగా వెనకాడుతుంటారు. అలాంటి మూవీ లవర్స్‌కు శుభవార్త. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోని టిక్కెట్ రేట్ల కంటే తక్కువ ధరతోనే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం వస్తే.. అది కూడా కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం కలుగనుంది. అయితే ఈ అఫర్ కేవలం ఒక్క రోజుకే పరిమితం. కాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రేక్షకులకు ఆ అద్భుత అవకాశం కల్పిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా లవర్స్ డే సందర్భంగా.. ఈ నెల 31న ఈ బంపర్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.99కే సినిమాలు చూడవచ్చని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ఆరోజు ప్రేక్షకులు రూ. 99కే చూడొచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న Asian, Inox, Cinepolis, PVR, Mirage, City Pride, Movie Time వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ అవకాశం ఉందని స్పష్టం చేసింది.
కాగా మే 31న మల్టీప్లెక్స్‌లోని కౌంటర్ వద్ద రూ.99 చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు. అదే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో.. అంటే, పేటీఎం, అమెజాన్ పే, బుక్ మై షోలలో టిక్కెట్స్ బుక్ చేసుకునే వారు రూ.99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధానపాత్ర పోషించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రాలు ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సో.. మూవీ లవర్స్ ఆ రోజున ఈ చిత్రాలు చూసే అవకాశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: