యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు చిత్రబృందం.
#GangsOfGodavari is certified with 𝐔/𝐀 🔥
Lankala Rathna and gang are ready to give you all an unforgettable experience! 🔥#GOGTrailer ▶️ https://t.co/Y4YcSUmTFJ
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres near you on MAY 31st! 🌊🔥… pic.twitter.com/TJBbaUMMGg
— Sithara Entertainments (@SitharaEnts) May 28, 2024
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























