ఈవారం బాక్సాఫీస్ వద్ద ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఐపీఎల్ అయిపోవడంతో అందరి ద్రుష్టి సినిమాలపై పడింది.ఐపీఎల్ కు తోడు రెండు నెలల నుండి సరైన సినిమాలు లేక డల్ సీజన్ నడిచింది.అయితే ఈ వారం వచ్చే సినిమాలతో మళ్ళీ థియేటర్లు కలకలడనున్నాయి.ఇక ఈసారి వస్తున్న సినిమాలు కూడా అంతే ఇంట్రెస్ట్ గా వున్నాయి.ఇందులో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయు వేగం అలాగే ఆనంద్ దేవరకొండ గం.గం.. గణేశా వున్నాయి.ఈ మూడు సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమూడు సినిమాల్లో కాస్త ఎక్కువ హైప్ తో వస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఇందులో విశ్వక్ మాస్ రోల్ లో కనిపించనుండడం అలాగే ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.టీం అంతా సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. అంజలి ,నేహా శెట్టి లు హీరోయిన్లుగా నటించగా కృష్ణ చైతన్య డైరెక్ట్ చేశాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్రాండ్ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.
ఇక కార్తికేయ భజే వాయు వేగం కూడా మంచి అంచనాలతో వస్తుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం దానికితోడు ఇందులో హీరో క్రికెటర్ కావడం ఇలాంటి అంశాలు యూత్ ను అట్రాక్ట్ చేసేవే. ప్రశాంత్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది.
ఈరెండు సినిమాలతో పాటు ఆనంద్ దేవరకొండ గం.గం.. గణేశాకు కూడా పాజిటివ్ బజ్ వుంది.వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథతో వస్తుంది.ఇందులో కామెడీ హైలైట్ అవ్వనుంది.ట్రైలర్ అయితే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.నయన్ సారిక హీరోయిన్ గా నటించగా ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్ట్ చేశాడు.వంశీ కారుమంచి,కేదార్ సెలగంశెట్టి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























