టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్ సహా పాటలు సినీ ప్రియులను అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. హరోంహర థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. రేపు ఉదయం 11:25 గంటలకు హరోంహర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది.
A ‘SUPER STAR’T for the Superb trailer🤩 @urstrulyMahesh gonna launch #HaromHaraTrailer tomorrow at 11.25 am!! #HaromHaraOnJune14th in theaters@suneeltollywood @ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @jungleemusicSTH @SSCoffl pic.twitter.com/5tIkMZAcMl
— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సుధీర్‌బాబు కుప్పం యాసలో మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో సునీల్, రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























