
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 142


కంగువ కౌంట్ డౌన్ స్టార్ట్

టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

కల్కి అక్కడ బ్రేక్ ఈవెన్

నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్, నెట్టింట వైరల్

పుష్ప 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్

తిరగబడర సామీ ట్రైలర్ రిలీజ్

వెంకీ హీరోయిన్ ఫిక్స్

కల్కి.. 5వ రోజు హిందీ కలెక్షన్స్

కల్కి.. నార్త్ అమెరికాలో మరో రికార్డ్

విశ్వక్ సేన్ లైలా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

వెంకటేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ

సుహాస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

శ్రీలంకలో పోరుకు రౌడీహీరో

ఫుల్ స్వింగ్ లో ది గోట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్
దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ది గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని తెలుపుతూ లాస్ ఎంజిల్స్ లో ఉన్న లోలా వీఎఫ్ఎక్స్ ఆఫీస్ వద్ద ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు.

నివేదా థామస్ 35 ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

కంగువ కౌంట్ డౌన్ స్టార్ట్
సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుండో కన్ఫ్యూజన్ ఉన్న రిలీజ్ డేట్ పై రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు కీలక సూచన చేశారు. ఇకపై సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోసం వచ్చే నిర్మాతలు తప్పనిసరిగా ఒక పని చేయాలంటూ పలు షరతులు విధించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ కొత్త గైడ్ లైన్ ఇచ్చింది.

కల్కి అక్కడ బ్రేక్ ఈవెన్
ప్రభాస్ కల్కి 2898 ఏ డి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.సెన్సేషనల్ వీకెండ్ రన్ తరువాత వీక్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.కేరళ లో అయితే మొదటి రోజు కన్నా నిన్న ఎక్కువ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. సోమవారం ఈసినిమా అక్కడ 4కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది దాంతో 5రోజుల్లో కల్కి 15కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను చేరుకునేలా వుంది.

నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్, నెట్టింట వైరల్
నందమూరి మోక్షజ్ఞ తేజ.. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అసలు సినిమాల్లోకి తన ఎంట్రీ ఎప్పుడో కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయొచ్చని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

సరిపోదా శనివారం-వేరే భాషల్లో గరం గరం సాంగ్ రిలీజ్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కుబేర నుండి రష్మిక ప్రీ లుక్ రిలీజ్
ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఏంటంటే ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

పుష్ప 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఈఏడాది చివరికి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.ఆగస్టు లో రావాల్సివుండగా షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు.ఇక ఈ రోజునుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈనెల అంతా ఈషెడ్యూల్ జరుగుతుంది.ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొనున్నాడు.క్లైమాక్స్ ఫైట్ ను షూట్ చేయనున్నారు.ఈ షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.సెప్టెంబర్ కల్లా మిగితా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను డిసెంబర్ 7న విడుదలచేయనున్నారు.

తిరగబడర సామీ ట్రైలర్ రిలీజ్
రీసెంట్ గా నా సామీ రంగ లో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో తిరగడబడర సామీ ఒకటి.ఏఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్ట్ చేస్తుండగా మాల్వి మల్హోత్ర హీరోయిన్ గా నటిస్తుంది.ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు రాజ్ తరుణ్.జేబీ సంగీతం అందిస్తుండగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.

వెంకీ హీరోయిన్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఇప్పటికే ఈసినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రానున్నట్టు తెలుస్తుంది.

కల్కి.. 5వ రోజు హిందీ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

కల్కి.. నార్త్ అమెరికాలో మరో రికార్డ్
టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.

విశ్వక్ సేన్ లైలా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. రెండు సినిమాలు కూడా మంటి టాక్ నే తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా అప్పుడే మరొక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా లైలా.

కల్కి.. అక్కడ తొలి సినిమాగా రికార్డ్
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

డార్లింగ్ సెకండ్ సింగిల్ రాహీ రే సాంగ్ రిలీజ్
అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు చివరి దశకు వచ్చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 19వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ
టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం.

సుహాస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సినీ కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత తక్కువ కాలంలోనే హీరోగా మారి.. హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

శ్రీలంకలో పోరుకు రౌడీహీరో
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విజయ్ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది.

డబుల్ ఇస్మార్ట్ నుండి.. ఫస్ట్ సింగిల్ స్టెప్పామార్ రిలీజ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.