సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విజయ్ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. రీసెంట్ గానే వైజాగ్ లో ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అక్కడ సముద్రంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ శ్రీలంకలో మొదలుపెట్టనున్నారట. దాదాపు మూడు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారని సమాచారం.
కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























