నందమూరి మోక్షజ్ఞ తేజ.. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అసలు సినిమాల్లోకి తన ఎంట్రీ ఎప్పుడో కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయొచ్చని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికి తోడు వీటికి బలం చేకూరుస్తూ మోక్షజ్ఞ అప్పుడప్పుడు తండ్రి సినిమా షూటింగ్స్ సెట్స్ వద్ద కనిపించి సందడి చేస్తున్నాడు. మరోవైపు బాలయ్య కూడా తన తనయుడి ఎంట్రీ త్వరలోనే ఉంటుందని పలు సందర్భాల్లో అనేకసార్లు చెప్పారు. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ లేటెస్ట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ ఒక అద్ధం ముందు కూర్చుని ఉన్నాడు. గడ్డంతో కనిపించిన మోక్ష్.. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకుని పక్కకు చూస్తూ ఉన్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మోక్ష్ లో మాంచి హీరో లుక్ ఉందని, త్వరగా ఆయన సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























