ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఏంటంటే ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. ఇప్పుడు రష్మిక మందన్న లుక్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. తాజాగా ఈసినిమాలోని రష్మిక ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ను జులై 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























