ప్రభాస్ కల్కి 2898 ఏ డి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.సెన్సేషనల్ వీకెండ్ రన్ తరువాత వీక్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.కేరళ లో అయితే మొదటి రోజు కన్నా నిన్న ఎక్కువ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. సోమవారం ఈసినిమా అక్కడ 4కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది దాంతో 5రోజుల్లో కల్కి 15కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను చేరుకునేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్న 10కోట్ల షేర్ ను సొంతం చేసుకోవడంతో మొత్తం 5రోజులకుగాను షేర్ 130కోట్లకు చేరింది.ఇదే రన్ ను కొనసాగిస్తే ఈ వారాంతంలో బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది.అటు ఓవర్సీస్ లో అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.నార్త్ అమెరికాలో 100కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి టార్గెట్ ను చేరుకుంది.ఫుల్ రన్ లో భారీ లాభాలను అందుకోనుంది.ఓవరాల్ గా ఈ వీకెండ్ లో కల్లా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ ఎక్కువగా వుంది.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ,దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో కనిపించగా భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























