యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. రెండు సినిమాలు కూడా మంటి టాక్ నే తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా అప్పుడే మరొక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా లైలా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. ఆమధ్య ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో విశ్వక్ సేన్ ఒక ఇంట్రెస్టింగ్ రోల్ లో వస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జులై 3న ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
కాగా ఈసినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈసినిమాకు తనిష్క్ బగ్చి సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్.. వాసుదేవ మూర్తి రైటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























