వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. గరం గరం అంటూ వచ్చే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈపాటకు సంబంధించి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. గరం గరం సాంగ్‌ను తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసినట్టు తెలిపారు చిత్రయూనిట్. ఈ పాటను విశాల్ దద్లానీ పాడగా.. జేక్స్ బిజోయ్ సంగీతం.. సనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ లీడర్ తరువాత మరోసారి నానికి జోడీగా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































