వెంకీ హీరోయిన్ ఫిక్స్

aishwarya rajesh on board for venkatesh and anil ravipudi movie

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఇప్పటికే ఈసినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రానున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. జూలై 3న ఉద‌యం 11.16 గంట‌ల‌కు ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలతో మొద‌ల‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తాజాగా తన ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేశారు. అంతేకాకుండా తాజాగా మరో అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాలో హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి కూడా మరో కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈసినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.