తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు కీలక సూచన చేశారు. ఇకపై సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోసం వచ్చే నిర్మాతలు తప్పనిసరిగా ఒక పని చేయాలంటూ పలు షరతులు విధించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ కొత్త గైడ్ లైన్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి సామజిక రుగ్మతలపై ప్రసారం చేయకపోతే థియేటర్లకు అనుమతి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా సరే వీటిపై అవగాహన కల్పించే ప్రకటనలను సినిమాలకు ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే దీనికి సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “సినిమా అనేది అత్యంత ప్రభావశీల మాధ్యమం. రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్లు పెంచాలని ఆయా చిత్రాల నిర్మాతలు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. కానీ వారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం లేదు. అయితే అది చిత్ర పరిశ్రమ కనీస బాధ్యత” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ఇలా తెలిపారు.. “మెగాస్టార్ చిరంజీవి గారిలా డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలి. ఇక నుంచీ డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమా ప్రదర్శనకు ముందుగానీ, తరువాత గానీ సుమారు 3 నిమిషాల వీడియోతో ప్రజలకు అవగాహన కల్పించాలి. దర్శక,నిర్మాతలు, నటీనటులు సహా ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ దీనిని విస్మరించినట్లయితే వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు ఉండవు’ అని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: