దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ది గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని తెలుపుతూ లాస్ ఎంజిల్స్ లో ఉన్న లోలా వీఎఫ్ఎక్స్ ఆఫీస్ వద్ద ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాటకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. రీసెంట్ గానే చిన్న చిన్న కంగల్ అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: