టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజువల్ వండర్‌గా తెరకెక్కిన కల్కి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీంతో ఈ మైథాలజీ-ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో ఒక అరుదైన రికార్డును సృష్టించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి వరుసగా 5వ రోజు 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ సాధించింది. తద్వారా ఈ ఘనత అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ముందుముందు మరిన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























