వెంక‌టేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ

Venkatesh and Anil Ravipudi Team up For Hat Trick Movie

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూలై 3వ తేదీన ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే మూవీ రెగ్యులర్‌ షూట్‌ కూడా ఈ వారంలోనే స్టార్ట్ అవుతుందని కూడా సమాచారం. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

కాగా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు సాధారణంగా కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటాయి. వెంకటేష్ హీరోగా గతంలో ఆయన తెరకెక్కించిన ఎఫ్‌ 2, ఎఫ్ 3 సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. వీటిలో వెంకీ తనదైన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవించాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో మూవీ రానుండటం, అది కూడా రెండు హ్యాట్రిక్ చిత్రం అవడం విశేషం. దీంతో ఈ సినిమా కూడా నవ్వుల పూవులు పూయించడం గ్యారంటీ అని భావిస్తున్నారు సినీ జనాలు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.