టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైథాలజీ-ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో కల్కి బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ ఎపిక్ మూవీ బ్లాక్ బస్టర్ కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పటికే ఇక్కడ పలు రికార్డులు సృష్టించిన ఈ మూవీ తాజాగా మరో సూపర్ రికార్డును అందుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి అత్యంత వేగంగా 100 Cr+ గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. కాగా ఇది ఏ భారతీయ సినిమాకైనా ఉత్తర అమెరికాలో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డ్ గా చరిత్ర సృష్టించింది. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు సినిమాగా, అలాగే మొదటి భారతీయ చిత్రంగా కూడా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























