క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సినీ కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత తక్కువ కాలంలోనే హీరోగా మారి.. హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. హీరోగా ఏదో ఒక సినిమా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా DRP4 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకోగా.. ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు అప్ డేట్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే తాజాగా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జనక అయితే గనక అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు టీజర్ ను రిలీజ్ అప్ డేట్ కూడా ఇచ్చారు. జులై 4వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈసినిమాను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























