పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ విజువల్ వండర్ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇదేక్రమంలో నార్త్ ఇండియాలోనూ కల్కి మూవీ అదరగొడుతోంది. బాహుబలి నుంచే హిందీ బెల్ట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. తాజాగా కల్కితో మరోసారి ఉత్తరాది రాష్ట్రాల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో అత్యధిక నెట్ అందుకున్న రెండో సినిమాగా కల్కి రికార్డ్ సృష్టించింది.
ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు తొలిరోజు గురువారం రూ. 22.50 కోట్లు రాగా.. రెండోరోజు శుక్రవారం అంతకంటే ఎక్కువగా రూ. 23.25 కోట్లు వచ్చాయి. అలాగే మూడోరోజు శనివారం రూ. 26.25 కోట్లకు చేరగా.. నాలుగోరోజైన ఆదివారం రూ. 40.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే క్రమంలో కీలకమైన సోమవారం ఐదోరోజున రూ. 16.50 కోట్లు అందుకుంది. దీంతో కల్కి హిందీ వెర్షన్ ఇప్పటివరకూ మొత్తం: రూ. 128.65 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లయింది.
దీనిపై ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొన్నారు.. “కల్కి 2898 AD ‘సోమవారం పరీక్ష’లో డిస్టింక్షన్ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 5వ రోజైన సోమవారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అసాధారణ కలెక్షన్స్ అందుకుంది. నిర్ణయాత్మక సోమవారం నాడు ప్రధాన సెంటర్లు సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న పట్టణాల్లో సింగిల్ స్క్రీన్‌లు చాలా కాలం తర్వాత అద్భుతమైన ఆక్యుపెన్సీని చూస్తున్నాయి” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























